
Trump Slams India: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నమ్మకమైన మిత్రుల్లో ఒకరు రష్యా. పాకిస్థాన్ ఇండియా వార్ సమయంలో భారతదేశానికి హ్యాండ్ ఇచ్చిన అమెరికా.. దాయాదితో చేసిన కుట్రలు ఇప్పటికీ చరిత్ర గుర్తుచేస్తూనే ఉంది. తన నేలపై యుద్ధాలు చేయని అమెరికా ప్రపంచంలోని అనేక ఇస్లామ్ దేశాలను యుద్ధం పేరుతో పతనం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ కి అండగా ఆయుధాలు అమ్ముకుంటున్న ట్రంప్ భారతదేశంపై విషం కక్కుతున్నారు.
భారతదేశం ఒకపక్క వాణిజ్య చర్చలు కొనసాగిస్తుండగా.. ట్రంప్ ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ 25 శాతం ప్రకటించారు. అమెరికాతో ఇండియా చాలా తక్కువ వ్యాపారం మాత్రమే చేసిందని.. తమ ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తోందన్నారు ట్రంప్. ఇదే క్రమంలో రష్యా-ఇండియా మధ్య ఉన్న స్నేహంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు పతనమైన ఆర్థిక వ్యవస్థలను కలిసి మరింత కిందికి తీసుకెళతాయని అయితే దానిని తాను అస్సలు పట్టించుకోనంటూ వ్యాఖ్యానించారు.
అమెరికా రష్యాల మధ్యా దాదాపుగా ఎలాంటి వాణిజ్యం జరగటం లేదన్న ట్రంప్.. రష్యా మాజీ ప్రెసిడెంట్ డిమిత్రి మెద్వెదేవ్‌ను కూడా విమర్శించారు. ఇప్పటికీ డిమిత్రి తానే అధ్యక్షుడిగా భావిస్తున్నారని, ఆయనొక విఫమైన నాయకుడని అన్నారు. దీనికి ముందూ జూలై 28న డిమిత్రి తన ఎక్స్ ఖాతాలో ట్రంప్ కి వార్నింగ్ ఇస్తూ.. రష్యాతో ప్రమాదకరమైన ఆటకు అమెరికా దిగుతోందని, అది యుద్ధానికి దారితీయవచ్చని అందులో యూఎస్ కూడా భాగం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.