ట్రంప్ : ఔను.. రష్యానే నన్ను గెలిపించింది

ట్రంప్ : ఔను.. రష్యానే నన్ను గెలిపించింది

వాషింగ్టన్: ‘‘రష్యా, రష్యా, రష్యా! నన్ను రష్యానే గెలిపించింది. అయితే అందుకోసం ఆ దేశంతో నేను లాలూచీపడలేదు’’ అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. అంతలోనే తప్పును తెలుసుకుని వైట్ హౌస్ రిపోర్టర్లతో ‘నేను ప్రెసిడెంట్ కావడం వెనుక రష్యా ప్రమేయమేమీ లేదు’ అని చెప్పారు. 2016 ప్రెసిడెంట్ ఎన్నికల్లో తన సామర్థ్యంపైనే ఆధారపడి గెలిచానన్నారు.

ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై రిపోర్టు రిలీజ్ చేసిన స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్ బుధవారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. జస్టిస్ డిపార్ట్ మెంట్ పాలసీ ప్రకారం తాను ప్రెసిడెంట్ పై కేసు నమోదు చేయలేనన్నారు. ఆయన్ను పదవిలో కొనసాగించాలా , అభిశంసన పెట్టాలా అన్న విషయాన్ని అమెరికన్ కాంగ్రెస్ కే వదిలేస్తున్నట్లు తెలిపారు.