ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ కు కరోనా

ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ కు కరోనా

అమెరికాలో వ్యాపిస్తున్న కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతూనే ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో ఓబ్రియన్ కు పాజిటివ్ అని తేలింది. దీనిపై వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఓబ్రియన్ కు కరోనా నిర్ధారణ అయ్యిందని…. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిపింది. క్వారంటైన్ లో ఉంటూ విధులు నిర్వర్తిస్తారని చెప్పింది. జాతీయ భద్రతా మండలి కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.

అమెరికా పాలన వ్యవహారాల్లోనూ, విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషించే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో పారిస్ వెళ్లి ఓ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎక్కడ కరోనా సోకిందన్న దానిపై స్పష్టతలేదు. జాతీయ భద్రతా సలహదారుకు కరోనా నిర్ధారణ అయినా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు కరోనా ముప్పు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.