ట్రూత్ ఆర్ డేర్.. నగ్న వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన తోటి విద్యార్థి

ట్రూత్ ఆర్ డేర్.. నగ్న వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన తోటి విద్యార్థి

సోషల్ మీడియా పరిచయాలు.. బంధాలతో ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ విషయం పెద్దలే కాదు.. సోషల్ మీడియా వాడుతున్న వారందరికీ తెలిసినా.. మళ్లీ అలాంటివి జరగడం కామన్ అయింది. బలవుతున్న వారంతా ఎక్కువగా యువతీ యువకులే. కెరీర్ కోసమంటూ సోషల్ మీడియాలో ఎంటరై.. ఆ తర్వాత క్షణికానందం.. క్షణిక సుఖాల కోసం.. థ్రిల్ కోసమంటూ..  అపరిచితులతో సరదా సంభాషణలు.. ఛాటింగులు చేసి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను కేవలం కెరీర్.. చదువుల కోసం తప్ప మరే ఇతర వాటికి వాడిన యువతీ యువకులు… చివరకు బాలబాలికలు సైతం తప్పుదోవపడుతున్నారు. చేజేతులారా చిక్కుల్లో కూరుకుపోయి జీవితాలను నాశనమైపోతున్న ఉదంతాలు ఎన్నెన్నో.

ట్రూత్ ఆర్ డేర్  గేమ్ ఆ బాలిక కొంప ముంచింది

సోషల్ మీడియాలో అపరిచితుడిగా పరిచయమైన బాలుడు.. చాలా మేధావిలా.. నిత్యం సరాదాగా.. సంతోషంగా గడిపేవాడులా కనిపించాడు.  మొదట్లో సరదాగా.. థ్రిల్లింగ్ గా అనిపించడంతో ముంబైలోని ఒక ప్రాంతానికి చెందిన  14 ఏళ్ల బాలిక అతడితో ఛాటింగ్ కంటిన్యూ చేసింది. అయితే సరదాగా నవ్వుతూ మాట్లాడితే అశ్లీల, డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతుండడంతో అతని నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టింది. తన వలలో చిక్కినట్లే చిక్కి జారిపోవడంతో భరించలేకపోయాడు. మరో నెంబర్ తో ఇంకో అకౌంట్ తెరచి.. ఫ్రెండ్ యాడ్ రిక్వెస్ట్ పంపాడు. ప్రతిరోజూ.. ఏదో ఒక కొటేషన్ తో.. ఫ్రెండ్ గా అంగీకరించమని రిక్వెస్ట్ మేసేజ్ పంపుతుండడంతో బాలిక నమ్మింది. ఒకసారి మోసపోయిన అనుభవం ఉండడంతో.. ఈసారి తెలివిగా ప్రవర్తించాడు. మాటల చాతుర్యంతో.. జోకులు వేసి నవ్వించి ఆకట్టుకున్నాడు. ఈ ఎత్తులు ఫలించడంతో వెంటనే అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని నేరుగా మాట్లాడడం ప్రారంభించాడు. నవ్వుకుంటూ సరదాగా మాటల్లో దింపి.. ఈ అమ్మాయిని ట్రాప్ చేసేందుకు చాలా తెలివితేటలు కనబరిచాడు. ఒకరోజు ఆమె ఒంటరిగా ఉంటున్నట్లు పసిగట్టి సరదాగా ‘‘ ట్రూత్ ఆర్ డేర్  గేమ్’’ ఆడదామంటూ అడిగాడు. ఎదుటివారు వేసిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలివ్వడమే.. కాదు ఓడినవారు గెలిచినవారు ఏం చెబితే అది చేయాలి. అదే ఈ గేమ్ కాన్స్పెప్ట్. అదే బాలిక కొంప ముంచింది. సరదాగా మాటల్లో దింపి తన మాదిరిగా ధైర్యం ఉంటే బట్టలు విప్పేసి నా ముందు నిలబడమంటూ సవాల్ విసిరాడు. తాను నిల్చుని ఆమె కూడా నిలబడాలంటూ ఒత్తిడి చేశాడు. తాను బట్టలు లేకుండా నిలబడింది వీడియోలో కనపడకుండా చేసి ఆ బాలిక మాత్రమే కనిపించేలా వీడియో రికార్డు చేశాడు. అంతే.. అదే రోజు రాత్రి.. ఆ వీడియోను బాలికకు పంపి.. బ్లాక్ మెయిల్ చేయసాగాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఈ వీడియో అందరికీ షేర్ చేస్తానని.. నీ బతుకు బస్టాండుపాలేనని బెదిరింపులకు దిగాడు. మళ్లీ మళ్లీ కెమెరా ఎదుట నిలబడి బట్టలన్నీ విప్పేయాలని బెదిరింపులకు పాల్పడసాగాడు. దీంతో బాలికకు ఏం చేయాలో పాలుపోలేదు. కొన్ని రోజులు అతడు చెప్పినట్లే చేసినా.. అతను మరింత రెచ్చిపోయి శాడిస్టులా ప్రవర్తించడం మొదలుపెట్టడంతో భరించలేకపోయింది. ఏం చేసుకుంటావో చేసుకోమంటూ.. అతడి ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో పిచ్చోడిలా మారి ఆ అమ్మాయి వీడియోను తన స్నేహితులకే షేర్ చేయడం ప్రారంభించాడు. తన నగ్న వీడియోలు చూసిన ఫ్రెండ్స్ వెంటనే అప్రమత్తం చేయడంతో బాలిక తల్లిదండ్రుల ద్వారా వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతని ఫోన్ నెంబర్లు.. అకౌంట్ల ద్వారా అతని అడ్రస్ కనిపెట్టి వెళ్లారు. అతను కూడా 14 ఏళ్ల తోటి అబ్బాయేనని.. ఈ బాలిక అమాయకత్వం గుర్తించి వలపన్ని ఇలా చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరూ మైనర్లే.. ఇద్దరూ ఒకే ఈడు వాళ్లు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. బాలల కోర్టులో హాజరుపరిచేందుకు చార్జిషీట్ దాఖలు చేశారు.

For More News..

ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలకు ఐదేళ్ల జైలు

ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. అయితే అప్డేట్ చేసుకోండి

108 అంబులెన్స్‌లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి

వీడియో: అది యాక్సిడెంట్ కాదు.. సూసైడ్.. పరిగెత్తుకెళ్లి లారీ కిందపడిన వ్యక్తి