
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ గ్రామీణ బ్యాంక్రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని బ్యాంక్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ఉద్యోగుల బాగోగులు చూసేందుకు యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పెన్షన్, ఆరోగ్య బీమా తదితర సమస్యలపై మాట్లాడుతానని చెప్పారు. సంఘం నాయకులు కట్ట ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, వెంకట్ రెడ్డి, సుబ్బారెడ్డి, గోపాల్ రావు, రవికాంత్, గణపతి హెగ్డే, రాజారావు, సుధాకర్ స్వామి తదితరులున్నారు.