బీసీ గురుకుల టీచర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

బీసీ గురుకుల టీచర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సంక్షేమ గురుకుల టీచర్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్​గా ఎన్. శ్రీజన, ప్రధాన కార్యదర్శిగా లివిన్ స్టన్ ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్​లో యూటీఎఫ్​ ఆఫీసులో సంఘం నేతలు సమావేశమయ్యారు. అనంతరం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. సంఘం స్టేట్ ట్రెజరర్​గా కె.ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్లుగా జె.రామకృష్ణ, సీహెచ్.​ సతీష్​, మురళి, అరుణాదేవి, స్వర్ణలత, రమేష్, కార్యదర్శులుగా జి.రమేష్, సునీల్, సీహెచ్ కృష్ణయ్య, ఆర్.మధు, లింగదాస్, లావస్య తదితరులు ఎన్నికయ్యారు.

 ఈ సంఘం టీఎస్ యూటీఎఫ్ కు అనుబంధంగా కొనసాగుతుందని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి మాట్లాడారు.  బీసీ గురుకులాల పనివేళలను, ఇతర గురుకులాలకు సమానంగా మార్చాలని కోరారు. టీచర్లపై ఉన్న బోధనేతర పనుల భారం తగ్గించాలని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.