కేసీఆర్ క్వారంటైన్ ముఖ్య‌మంత్రి.. 6 సం.లుగా అందులోనే

కేసీఆర్ క్వారంటైన్ ముఖ్య‌మంత్రి.. 6 సం.లుగా అందులోనే

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ . కేసీఆర్ క్వారంటైన్‌లో ఉన్నారని.. పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో నుంచి బయటకురారని ఆయన విమర్శించారు.జోకర్ ముఖ్యమంత్రి , క్వారంటైన్ ముఖ్యమంత్రి అన్న పేరు కేసీఆర్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుందని అన్నారు .6 సంవత్సరాలుగా క్వారంటైన్‌లోనే ఉన్నారని.. అప్పుడప్పుడు నేను బతికే ఉన్నాన‌ని చెప్పేందుకు బయటకి వస్తారని, ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడతారని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ప్రజలను-రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.కోటి టన్నుల ధాన్యం సేకరిస్తా అన్న సీఎం ఇప్పటి వరకు 20 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని ఆయ‌న అన్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అగ్రికల్చర్ బులిటెన్ విడుదల చేస్తున్నాయని.. మరి తెలంగాణ సర్కార్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

దేశంలో 17 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో ర‌కంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని.. తెలంగాణ సీఎం మాత్రం మేం ధాన్యం సేక‌రించ‌కుంటే ప‌రిస్థితి ఏంట‌ని రైతుల‌ని బెదిరిస్తున్నార‌ని అన్నారు సంజ‌య్. సీఎం రైతులను అవమానిస్తున్నారని ఆయ‌న అన్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో‌ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వర్తిత్వం మాత్రమే వ్యవహరిస్తుంద‌ని , ఒక్క‌ రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. గన్ని బస్తాలు, రవాణా చార్జీలు … ఇలా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని ఆయ‌న అన్నారు. అధికారుల ద్వారా సీఎం రైతుల ను బెదిరిస్తున్నారని…రాష్ట్ర ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే ఆయ‌న చేసేది బ్రోకరిజం అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పై డీటైల్ గా బులెటిన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్ర‌శ్నించారు సంజ‌య్. రైతు పంట దగ్ధం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే…అది ఈ ప్రభుత్వ చేతకాని తనమ‌ని అన్నారు. కేంద్ర నిధుల మీద ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల మరణాలను కోరుకుంటోంది కేసీఆరేనని, కేసీఆర్ నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లో క‌రోనా కేసులు పెరిగాయని సంజయ్ మండిపడ్డారు.టెస్టులు జరగాలని కేంద్రం అంటుంటే కేసీఆర్ మాత్రం తన పేరు కోసం టెస్టులను తగ్గించారని అన్నారు. లాక్ డౌన్ లో రోడ్ల మీద బరితెగించి తిరుగుతున్న వారి కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు.

పాతబస్తీలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేయడం దురదృష్టకరమని అన్నారు సంజ‌య్. బాలికపై అత్యాచారం చేసిన mim గుండా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు, రేపిస్ట్ లకు అడ్డాగా ఓల్డ్ సిటీ ని మార్చిన mim కి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందన్నారు. ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు.

quarantine cm