
బీపాస్‌కు బ్రేక్
కేబినెట్ ఆమోదం తర్వాతే అమలు
హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బిల్డింగులు కట్టేందుకు ఇచ్చే అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన టీఎస్బీపాస్అమలు వాయిదా పడింది. జూన్2 నుంచి టీఎస్‌బీపాస్ అధికారికంగా అమలులోకి వస్తుందని ఇటీవలి వరకు చెప్పిన మున్సిపల్ శాఖ దీనికి మరిన్ని రోజులు పడుతుందని వెల్లడించింది. రాష్ర్ట కేబినెట్ ఆమోదం తర్వాతే టీఎస్‌బీపాస్ అధికారికంగా అమలులోకి వస్తుందని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ శనివారం చెప్పారు. అప్పటివరకు టీఎస్-బీపాస్ ట్రయల్బేసిస్లో నడుస్తుందని పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఇచ్చిన అధికారాలలో భాగంగా పట్టణ ప్రణాళికలు, భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్అనుమతులు స్థానిక సంస్థలే నిర్వహిస్తాయని తెలిపారు. టీఎస్బీపాస్కు సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కొనసాగుతోందన్నారు.
For More News..