కేసీఆర్ బడ్జెట్ స్పీచ్ : హైలైట్స్ ఇవీ

కేసీఆర్ బడ్జెట్ స్పీచ్ : హైలైట్స్ ఇవీ

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్‌. సీఎం బడ్జెట్ స్పీచ్ లోని హైలైట్ పాయింట్స్ ఇవే.
* తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.
* అన్ని రంగాలకు 24గంటల పాటు విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం.
* వ్యవసాయ రంగంలో అడ్డంకులను ఒక్కొక్కటి తొలగించుకుంటూ ముందుకు సాగుతూ రైతుల్లో నైరాశ్యాన్ని తొలగిస్తున్నాం.
* అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్‌ గురించి చర్చ జరుగుతోంది.
* తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం.
* ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది.

* మరోసారి ప్రజలు తెరాసకు అధికారం ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటారు.
* 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైంది.
* పేదల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నాం.
* దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నాం.
* వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తాం.
* ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నాం.

* 2019-20 సంవత్సారానికి మొత్తం బడ్జెట్‌ రూ.1,82,017కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
* మూలధన వ్యయం రూ.32,815కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు
* కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు.
* నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
* ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
* ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
* రైతు రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు

* బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు
* రైతు బీమా కోసం రూ.650కోట్లు
* రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు. ఇందు కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు
* ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
* వ్యవసాయశాఖకు రూ.20,107కోట్ల కేటాయింపు.

* 2019-20 బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు కేటాయింపు

* ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు
* పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు
* ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు
* 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు
* టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు
* టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు
* 8.58లక్షల ఉద్యోగాలు వచ్చాయి.