రేపు రాష్ట్ర కేబినేట్ భేటీ

రేపు రాష్ట్ర కేబినేట్ భేటీ

రేపు ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర కేబినేట్ భేటీ కానుంది.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. పిభ్రవరి 6 న అసెంబ్లీలో  ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలుపనుంది. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ సభకు బయల్దేరి వెళ్లనున్నారు. 

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో అధికార పార్టీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ సభకు హాజరుకానున్నారు. ఈ సభలో భారీ ఎత్తున చేరికలుంటాయని తెలుస్తోంది.