ఏడేళ్లుగా తెలంగాణ ఆగమయ్యింది

ఏడేళ్లుగా తెలంగాణ ఆగమయ్యింది

హైద‌రాబాద్ : కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ జూమ్ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్.. ఏఐసీసీ ఇచ్చిన పిలువు మేరకు అందరికి వ్యాక్సినేషన్ చేయాలని క్యాంపెయిన్ చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి సాయం చేయాలన్నారు..కాంగ్రెస్ నేతలు. రెమ్ డెసివర్ ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చి.. వ్యాక్సినేషన్ సక్రమంగా చేపట్టాలన్నారు. ఏడేళ్లు తెలంగాణ ఆగం అయ్యిందని..టీఆరెస్ అధికారంలోకి వచ్చి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని విమర్శించారు. మొదటి లాక్ డౌన్ నుండి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లైట్ తీసుకున్నాయన్నారు. ఈ విషయాలను తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. పక్క రాష్ట్రాలు కరోనా ట్రీట్ మెంట్ ఉచితంగా చేస్తే.. ఇక్కడ మాత్రం అమలు కావడం లేదన్నారు. అన్ని మండల కేంద్రాల్లో RTPCR టెస్టింగ్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేశారు. 


సంవత్సరానికి 2కోట్ల లక్షల బడ్జెట్ వున్న తెలంగాణను..అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. టీఆర్ఎస్ ను కేసీఆర్ ను రేపు అన్ని జిల్లాలో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం హామీలు.. హామీలుగానే మిగిలిపోతున్నాయన్నారు. నిరుద్యోగ సమస్యపై సర్కార్ పట్టించుకోవడం లేదని..నిరుద్యోగ భృతి పై మాటే లేదన్నారు. కేసీఆర్ ఏడేళ్ల కాలంలో ప్రజలను ఏవిధంగా మోసం చేసిండో చెప్పాలన్నారు. సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో రాష్ట్రాన్ని ఇచ్చారో.. అది నెరవేరడం లేదన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు. డిపిఆర్ లు లేకుండా ప్రాజెక్టులు కట్టి.. వేలకోట్లు దోచుకుంటున్నారని అన్నారు. కరోనా తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. బాధితులను పట్టించుకునే నాధుడే లేడన్నారు.బ్లాక్ ఫంగస్ వస్తే.. మందులు కూడా లేవన్నారు. సర్కార్ ఫెయిల్యూర్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా లక్ష్యం నెరవేరడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు.