జూలై 10న డీఈఈసెట్

జూలై 10న డీఈఈసెట్

హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌‌ ప్రీ స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ (డీపీఎస్‌‌ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే డీఈఈసెట్ పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. 

ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పారు. డీఈఈ సెట్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 8 నుంచి ప్రారంభం కాగా, సోమవారం నాటికి 9, 200 మంది అప్లై చేసుకున్నారు.