ఎంసెట్ కౌన్సెలింగ్: తొలివిడత 60,941సీట్ల కేటాయింపు

ఎంసెట్ కౌన్సెలింగ్: తొలివిడత 60,941సీట్ల కేటాయింపు

హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా ఇంజనీరింగ్ కేటగిరిలో తొలివిడుత 60,941 సీట్లు అంటే 82.24 శాతం కేటాయించారు. అంతే వేగంగా 31 ఇంజనీరింగ్ కాలేజీల్లో తొలి విడుతనే సీట్లన్నీ భర్తీ అయిపోయాయి. మొదటి విడత కేటాయింపు అనంతరం కన్వీనర్ కోటాలో మాత్రం 13,130 సీట్లు మిగిలిపోయాయని రాష్ట్ర  సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యుఎస్) కోటాలో 5,108 సీట్లను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. 
ఫార్మా కోర్స్లులో ఎంపీసీ అభ్యర్థులు తక్కువే
ఎంపీసీ చదివిన వారి నుంచి ఫార్మా కోర్సులకు వచ్చేవారి సంఖ్య పెద్దగా లేదు. బీఫార్మసీలో 4,199 సీట్లను కేటాయించగా.. ఫార్మ్ డీ సీట్లలో కేవలం 228 సీట్లు మాత్రమే అయ్యాయని రాష్ట్ర  సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కోర్సుల్లో చేరిన వారు ఈనెల 23వ తేదీలోగా ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆయన కోరారు.