ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

ఐసెట్ కౌన్సెలింగ్, ఇంజినీరింగ్ రెండో సంవ‌త్సరంలో  ప్రవేశాల‌కు నిర్వహించే ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. 

ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

ఐసెట్ కౌన్సెలింగ్ ఆగ‌స్టు 14 నుంచి మొదలవనుంది. ఆగస్టు 14 నుంచి 18వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 16 నుంచి 21 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 25వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబ‌ర్ 1 నుంచి తుది విడుత ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్1 నుంచి 3 వ‌ర‌కు తుది విడుత వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. సెప్టెంబ‌ర్ 7న తుది విడ‌త ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబ‌ర్ 8న స్పాట్ అడ్మిష‌న్ల మార్గదర్శకాలు రిలీజ్ అవుతాయి. 

ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

ఈసెట్ కౌన్సెలింగ్ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో సంవ‌త్సరంలో ప్రవేశాల‌కు షెడ్యూల్ రిలీజ్ అయింది. జులై  29 నుంచి ఆగ‌స్టు 1  వ‌ర‌కు ఈసెట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జులై  31 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జులై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు ఈసెట్ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఆగ‌స్టు 8న ఈసెట్ అభ్యర్థుల‌కు తొలి విడుత సీట్ల కేటాయింపు ఉంటుంది.  ఆగ‌స్టు 20 నుంచి ఈసెట్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ కొన‌సాగ‌నుంది. ఆగ‌స్టు 26న ఈసెట్ అభ్యర్థుల‌కు తుది విడుత సీట్లు కేటాయిస్తారు.