తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గురువారం(నవంబర్27) తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ప్రభుత్వ విప్ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా పడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని స్వామి వారిని వేడుకున్నారు.
