Farmhouse case : సీఎం ప్రెస్ మీట్ పెట్టిండని కేసు సీబీఐకి ఇస్తరా?

Farmhouse case : సీఎం ప్రెస్ మీట్ పెట్టిండని కేసు సీబీఐకి ఇస్తరా?

ఫాం హౌస్ కేసులో సిట్ను రద్దు చేస్తే అసలు కేసు ఎక్కడిదని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది.  సీఎం ప్రెస్ మీట్ పెట్టారన్న సాకుతో కేసును సీబీఐకి అప్పగించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఫాం హౌస్ కేసుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలను న్యాయమూర్తికి వివరిస్తున్నారు. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన తర్వాతే అవి సీఎం కేసీఆర్ చేతికి వెళ్లాయని దవే న్యాయస్థానానికి విన్నవించారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కోర్టుకు సరైన సమాచారం అందించలేకపోయారని చెప్పారు. 

పైలెట్ రోహిత్ రెడ్డి సాక్ష్యాలు, ఆధారాలను సీఎం కేసీఆర్ కు ఇచ్చి ఉంటారని కోర్టుకు చెప్పారని, అయితే అలా జరగలేదని దవే న్యాయమూర్తికి వివరించారు. సీఎం ప్రెస్ మీట్ కు ముందే ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంటే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని చెప్పారు.