
- పాలనా అనుమతి ఇస్తూ.. జీవో జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: మూసీ నది, దాని ఉపనది ఈసీపై నార్సింగి నుంచి నాగోల్ వరకు రూ. 545 కోట్లతో 15 బ్రిడ్జిలను నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ శనివారం జీవో జారీ చేసింది. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షించనున్న ఈ బ్రిడ్జిల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ భరించాల్సి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. నిర్మాణ ఏజెన్సీని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఖరారు చేయాలని ఆదేశించింది. మూసీపై 12, ఈసీపై 3 బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఇప్పటికే మూసీ వెంబడి ట్రాఫిక్ సర్వే పూర్తి చేశామని, దానికి అనుగుణంగా డెవలప్ మెంట్ పనులు సాగుతాయని అధికారులు తెలిపారు.