పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త..

పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త..

పోలీస్ శాఖలో ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మరో రెండేళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా పోలీసు ఉద్యోగ అభ్యర్థల వయో పరిమితి పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. రెండేళ్లుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదంటూ వర్సిటీలతో పాటు...డిజిపి ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. తెలంగాణలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల  కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సిఎం కెసిఆర్.. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని ఆదేశించారు.