కేంద్రం ఇచ్చే రూ.5లక్షల కరోనా లోన్ కు రాష్ట్రం అడ్డంకి

కేంద్రం ఇచ్చే రూ.5లక్షల కరోనా లోన్ కు రాష్ట్రం అడ్డంకి
  •     అప్లికేషన్ల వివరాలివ్వాలని జూన్‌ 7న రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
  •     తొలుత పట్టించుకోని సర్కారు.. అప్లై చేసుకోవాలని 24న బీసీ శాఖ హడావుడి
  •     దరఖాస్తులు తీసుకోవద్దని రెండు రోజులకే నిలిపివేత
  •     అనేక చోట్ల అప్లై చేసినా తీస్కోలే.. కొన్ని చోట్ల తీస్కున్నా పక్కన పడేసిన్రు
  •     ఎస్సీ అభివృద్ధి శాఖ నుంచి అసలు దరఖాస్తుల సప్పుడే లేదు
  •     కరోనా మరణాల లెక్కలు బయటపడ్తాయనే రాష్ట్రం అడ్డుపడినట్టు విమర్శలు

హైదరాబాద్‌, వెలుగు: కరోనాతో చనిపోయిన వాళ్ల కుటుంబాలను రాష్ట్ర సర్కారు పట్టించుకుంట లేదు. ఆదుకుంటామని ముందుకొచ్చిన కేంద్రానికేమో సహకరిస్తలేదు. బాధిత కుటుంబాలకు స్మైల్‌ స్కీమ్‌ కింద రూ. 5 లక్షల లోన్‌ ఇస్తామని, అప్లికేషన్ల వివరాలు పంపాలని కేంద్రం అడిగితే.. జనం దగ్గర్నుంచి అసలు దరఖాస్తులే తీసుకోలేదు. టైమ్‌ అయిపోయే ముందు స్కీమ్‌కు అప్లై చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ హడావుడి చేసినా రెండ్రోజులకే దాన్నీ బంజేసింది. దీంతో జిల్లాల నుంచి ఒక్క దరఖాస్తు కూడా పోలేదు. ఎస్సీ, ఎస్టీ శాఖ నుంచైతే అసలు సప్పుడే లేదు. బుధవారంతో అప్లికేషన్ల టైమ్‌ ముగియనుంది. కేంద్ర సాయం బాధిత కుటుంబాలకు అందకుండా పోయింది. రాష్ట్రంలో పథకం అమలు చేస్తే కేంద్రానికి మంచి పేరొస్తదని, పైగా కరోనా మరణాల లెక్కలు బయటపడ్తాయని అడ్డుపడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ రాలేదని అధికారులు చెబుతున్నారని, అన్ని రాష్ట్రాలకు మంచిగనే వచ్చిన గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ మనకే ఎందుకు సరిగా రాకుండా పోయాయని జనం ప్రశ్నిస్తున్నారు.   

రూ. లక్ష సబ్సిడీతో రూ. 5 లక్షల లోన్‌‌‌‌‌‌‌‌

కరోనాతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం స్మైల్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. ఆయా కులాలకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ లోన్లు ఇచ్చేందుకు దీన్ని ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు లోన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేలా, ఇందులో రూ. లక్ష సబ్సిడీ ఇచ్చేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ మేరకు కేంద్ర సామాజిక, న్యాయ శాఖ ఉత్తర్వులిచ్చింది. కరోనాతో ఎఫెక్టయిన కుటుంబాల అప్లికేషన్ల వివరాలను పంపించాలని రాష్ట్రాలకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీ సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌ జూన్‌‌‌‌‌‌‌‌ 7న ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఆయా శాఖలు కలెక్టర్ల ద్వారా వివరాలు తెప్పించి కేంద్రానికి అందజేయాలి. ఈ లోన్లను నేషనల్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌(ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీఎఫ్‌‌‌‌‌‌‌‌డీసీ), నేషనల్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌బీసీఎఫ్‌‌‌‌‌‌‌‌డీసీ) మంజూరు చేస్తాయి. 

ఒక్క అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ కూడా తీస్కోలె

స్మైల్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం జూన్‌‌‌‌‌‌‌‌ 7న ఉత్తర్వులిచ్చి జూన్‌‌‌‌‌‌‌‌ 30వ తేదీ వరకు టైమిచ్చింది. కానీ రాష్ట్ర సర్కారు స్పందించలేదు. అయితే ఈమధ్యే బీసీ సంక్షేమ శాఖ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లడంతో అప్లికేషన్లు పెట్టుకోవాలని ఈ నెల 24న జిల్లా కలెక్టర్లు ప్రకటనలు చేశారు. కానీ అప్లికేషన్లు తీసుకోవద్దని 26న అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో అప్లికేషన్ల ప్రక్రియ నిలిపేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీసీ సంక్షేమ శాఖకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కొంత మంది దరఖాస్తు ఫామ్‌‌‌‌‌‌‌‌లతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులకు పోయినా తీసుకోలేదు. ఇంకొన్ని చోట్ల తీసుకుని పక్కన పడేసినట్లు తెలిసింది. అధికారులేమో సరైన గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ రాలేదని, అందుకే నిలిపేశామని చెబుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిస్థితి ఇలా ఉంటే ఎస్సీ అభివృద్ధి శాఖ అసలు అప్లికేషన్లకే పిలవలేదు. దీంతో బాధితులకు సాయం అందకుండా పోతోంది.

కేసులు బయటపడ్తయనేనా?

రాష్ట్రంలో కరోనాతో రోజుకు వందల మంది చనిపోయినట్లు వార్తలొచ్చాయి. కానీ సర్కారు మాత్రం రోజువారీ హెల్త్‌‌‌‌‌‌‌‌ బులెటిన్‌‌‌‌‌‌‌‌లో కేసులు, మరణాలను తక్కువ చూపించింది. కరోనాతో చనిపోయినా లంగ్‌‌‌‌‌‌‌‌ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌, నిమోనియా లాంటి వేరే కారణాల కింద లెక్కగట్టింది. అయితే బులెటిన్‌‌‌‌‌‌‌‌లో ప్రకటించకున్నా చాలా మంది పేషెంట్లకు కరోనాతోనే చనిపోయారని సర్టిఫికెట్లు ఇచ్చారు. రాష్ట్రంలో ఫస్ట్‌‌‌‌‌‌‌‌, సెకండ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌లతో కలిపి 3,651 మందే మృతి చెందినట్లు మంగళవారం బులెటిన్‌‌‌‌‌‌‌‌లో ప్రకటించారు. వాస్తవానికి ఈ సంఖ్య 50 వేలకు పైనే ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం ప్రకటించిన లోన్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు అప్లై చేసుకోవాలంటే డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌లో కరోనా మరణం అని ఉండాలి. ఒకవేళ ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు 3,651 కన్నా ఎక్కువ అప్లికేషన్లు వస్తే రాష్ట్ర సర్కారుకు తలనొప్పిగా మారనుంది. దీనిపై సర్కారు ఆందోళన చెందినట్టు తెలిసింది. ఈ కారణంతో పాటు లోన్‌‌‌‌‌‌‌‌ సాయంతో కేంద్రానికి మంచి పేరు వస్తుందని కూడా అడ్డుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.  

కావాలనే రాష్ట్రం అడ్డుకుంది

కేంద్రం ఇస్తున్న రూ. 5 లక్షల లోన్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కారు అవగాహన కల్పించలేదు. కనీసం అప్లై చేసుకోవాలని కూడా చెప్పలేదు. గడువు ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు హడావుడి చేశారు. జనం తెలుసుకునేలోపే టైమైపోయింది. కేంద్రం ఇస్తుండటంతో రాష్ట్రం కావాలనే అడ్డుకుంటోంది. కరోనా మరణాలు బయటపడ్తాయని ఆందోళన కూడా కనిపిస్తోంది. పథకం గురించి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ప్రచారం చేశారు.  
- ఆలె భాస్కర్‌‌‌‌‌‌‌‌,    బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌

అప్లికేషన్‌ ఇస్తే తీస్కోలె

ఇటీవల మా అమ్మ కరోనాతో చనిపోయింది. కరోనాతో చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించిన్రు. అన్ని సర్టిఫికెట్లతో 4 రోజుల క్రితం కలెక్టరేట్‌కు పోయి అప్లికేషన్‌ ఇస్తే ఆఫీసర్లు తీస్కోలేదు. ఇప్పుడు తీసుకుంటలేమని చెప్పిన్రు. లోన్‌తో కష్టాలు తీరుతయనుకుంటే నిరాశే ఎదురైంది. 
– సాయి కిరణ్‌, ఆదిలాబాద్

కావాలనే రాష్ట్రం అడ్డుకుంది

కేంద్రం ఇస్తున్న రూ. 5 లక్షల లోన్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కారు అవగాహన కల్పించలేదు. కనీసం అప్లై చేసుకోవాలని కూడా చెప్పలేదు. గడువు ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు హడావుడి చేశారు. జనం తెలుసుకునేలోపే టైమైపోయింది. కేంద్రం ఇస్తుండటంతో రాష్ట్రం కావాలనే అడ్డుకుంటోంది. కరోనా మరణాలు బయటపడ్తాయని ఆందోళన కూడా కనిపిస్తోంది. పథకం గురించి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ప్రచారం చేశారు.  
- ఆలె భాస్కర్‌‌‌‌‌‌‌‌,    బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌