గురుకుల పోస్టుల ప్రైమరీ కీ రిలీజ్​

గురుకుల పోస్టుల ప్రైమరీ కీ రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 9,210 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఆన్​లైన్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించిన ఎగ్జామ్స్​కు మొత్తం 75.68% మంది అటెండ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూట్స్ రిక్రూట్‌‌మెంట్ బోర్డ్ (ట్రిబ్) కన్వీనర్ డాక్టర్ మల్లయ్య భట్టు  ప్రకటించారు. ఎగ్జామ్స్ కు సంబంధించిన ప్రైమరీ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ వెబ్ సైట్​లో పెట్టామని ఆయన తెలిపారు. అభ్యర్థులు కీ తీసుకోవచ్చని,  ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల26లోగా తెలపాలని సూచించారు. ఈ మెయిల్, పిటిషన్ల ద్వారా ఇచ్చేవాటిని పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు.