వెంటిలేటర్లు, బెడ్ల వివరాలు డిస్ ప్లే చేయండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పాజిటివ్ తేలాక కూడా పట్టించుకోకుంటే ఎట్లా?
తాజా హెల్త్ బులెటిన్లో వివరాలు సరిగా లేవు
ఎన్నిసార్లు చెప్పినా అలాగే వ్యవహరిస్తరా?
టెస్టులు చేయడంలో ఎంతో వెనుకబడే ఉన్నరు
ప్రైవేటు హాస్పిటళ్లలో వసూళ్లపై చర్యలెవ్వి?
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణకు
హాజరైన సీఎస్, ఇతర ఆఫీసర్లు
అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందడం కష్టంగా ఉందని.. పాజిటివ్ ఉన్నట్టుతేలిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అందకపోవడం దారుణమని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటళ్ల వద్ద డ్యాష్ బోర్డులను ఏర్పాటు చేసి.. వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్స్, ఇతర బెడ్స్ ఖాళీల వివరాలు వెల్లడిస్తే ఈ పరిస్థితి కొంత తగ్గేదని అభిప్రాయపడింది. తాము
గతంలో ఎన్నోసార్లు ఆదేశించినా సర్కారు ఇంతవరకు దానిని అమలు చేయలేదని తప్పుపట్టింది. లైవ్ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తే.. కరోనా పాజిటివ్ గా తేలిన వారికి వెంటనే ట్రీట్మెంట్
అందించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్పై దాఖలైన 16 పిల్స్‌పై చీఫ్‌జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ కొనసాగించింది. సర్కారు తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విచారణకు హాజరయ్యారు.
వివరాలేవీ సరిగా చెప్పరా?
రోజువారీ హెల్త్‌బులిటెన్‌లో జిల్లాల వారీగా హాస్పిటళ్లు, బెడ్స్, ఇతర సమాచారం ఇస్తే.. బాధితులు ఇబ్బం
దిపడాల్సిన దుస్థితి ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. బులిటెన్లలో వయసు వారీగా బాధితుల సంఖ్య ఇవ్వాలని పేర్కొంది. మిలియన్ జనాభాకు ఎన్ని టెస్టులు చేశారో, ఎందరికి పాజిటివ్ వచ్చిందన్నది బులిటెన్లలో లేకపోవడాన్ని తప్పుపట్టింది. గతంతో పోలిస్తే తాజా బులిటెన్ కొంత మెరుగని, అయినా తమ ఆదేశాలకు అనుగుణంగా వివరాల్లేవని స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా గురించి బయటకు వచ్చిచెప్పడంలేదని, సర్కారే జనం దగ్గరకు వెళ్లిపాజిటివ్ బాధితులను గుర్తించాలని చెప్పింది. కంటెయిన్మెంట్‌జోన్లలో టీములు ఏర్పాటు చేశామని చెప్తున్న సర్కారు.. ఆటీమ్స్ ఎందరు బాధితులను గుర్తించాయనే వివరాలు హెల్త డిపార్ట్ మెంట్ రిపోర్టులో లేకపోవడాన్ని తప్పుపట్టింది.
టెస్టులపై నిర్లక్ష్యమెందుకు?
రాష్ట్రంలో కరోనా టెస్టుల తీరును, సీఎస్ చెప్పినవి వరాలను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. టెస్టులు
చేయడంలో తెలంగాణ బాగా వెనుక బడిందని గణాంకాలతో సహా తేల్చి చెప్పింది. మహారాష్ట్రలో రోజుకు
46 వేలు , తమిళనాడు, ఏపీల్లో 30 వేలకుపైగా, కర్నాటక, రాజస్థాన్లలో 17 వేలకుపైగా టెస్టులు
చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం పదివేలలోపే చేస్తున్నారని పేర్కొంది. రెండు లక్షల ర్యాపిడ్ కిట్లు ఉన్నాయని, మరో నాలుగు లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చామని సీఎస్ చెప్పగా.. ర్యాపిడ్ కిట్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. రాజస్థాన్ ఆ కిట్లవినియోగాన్ని నిలిపేసిందని, ఇక్కడ కూడా నిపుణులతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని సర్కారును ఆదేశించింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులతో 40 శాతమే రిజల్టస్ సరిగా ఉంటున్నాయని.. అందుకే రాజస్థాన్ ఆ టెస్టులను నిలిపేసిందని చెప్పింది.
ప్రైవేటు హాస్పిటళ్లపైచర్యలెవ్వి?
ప్రైవేట్ హాస్పిటళ్లలో అడ్డగోలు వసూళ్లు, సరైన వైద్యం అందించకపోవడం, బెడ్స్ ఉన్నా పేషెంట్లకు ఇవ్వకపోవడం, చార్జీల దోపిడీ వంటి వాటిపై సర్కారుకు 726 ఫిర్యాదులు వస్తే.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పకపోవడంపై హైకోర్టు మండిపడింది. ఫిర్యాదులు వచ్చాయంటే సరిపోదని, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎన్ని ప్రైవేట్ హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి ఉంటే వాటి గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
యువతను అలర్ట్ చేయండి
యువతపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్న ప్రచారం తప్పు అని.. హెల్త్‌బులిటెన్లను చూస్తే
పాజిటివ్, మరణాల సంఖ్యలో 21 ఏండ్లనుంచి 50 ఏండ్ల మధ్య వయసు వాళ్లే చాలా వరకు ఉన్నారని
హైకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే యువతను అలర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించాలంది. కరోనా బాధితుల్లో 51 ఏండ్ల నుంచి 81 ఏండ్ల మధ్య వయసు వాళ్లు25.6 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేసింది.
ఖరీదైన హోటళ్లలో క్వారంటైన్ పెడ్తే ఎట్ల?
పది హోటళ్లలోని రూములను క్వారంటైన్‌కు వినియోగిస్తున్నామని సీఎస్ చెప్పగా.. హైకోర్టు పలు
సూచనలు చేసింది. పెద్ద హోటళ్లలో క్వారంటైన్ ఏర్పాటు చేస్తే అక్కడికి పేదలు వెళ్లలేరని, పిటిషనర్ల
లాయర్ సూచించినట్టుగా కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కాలనీల్లోని సర్కారీ బిల్డింగులను క్వారంటైన్,
ఐసోలేషన్ సెంటర్లుగా చేస్తే బాగుంటుందంది.
అసలు లెక్కలు తేల్చండి
కరోనా బాధితులు, మరణాల సంఖ్యపై పలు అనుమానాలు ఉన్నాయని, సర్కారు వాస్తవాలు దాస్తోందంటూ పేపర్లలో వార్తలు రావడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. వాటిలో నిజమెంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వాస్తవాలను దాచిపెడితే నష్టపోయేది రాష్ట్రమేనని హెచ్చరించింది. నిజాలు చెప్తేనే కరోనా బాధితుల గోడు తెలిసి, నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని స్పష్టం
చేసింది. అయితే కరోనాకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు రెండు
వారాల టైం కావాలని సీఎస్ విన్నవించారు. దీంతో విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పటికి ఆదేశాల అమలుపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు పేర్కొంది. అప్పుడు జరిగే విచారణకు కూడా సీఎస్, ఇతర అధికారులు హాజరుకావాలని ఆదేశించింది.
పాలనా సమస్యలనూ చూడండి
అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అంతా సర్వశక్తులు ఒడ్డి కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నారని
సీఎస్ కోర్టుకు చెప్పారు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లకూ కరోనా వచ్చిందని, అయితే జనం భయాందోళ
నకు గురవుతారనే కారణంగా వెల్లడించడంలేదని తెలిపారు. పాలనాపరంగా తమకు ఉండే సమస్యల
కోణంలో కూడా కోర్టు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

