ఐఏఎస్‌ అధికారుల కేటాయింపుపై.. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

ఐఏఎస్‌ అధికారుల కేటాయింపుపై.. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

ఐఏఎస్‌ అధికారుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. కేంద్రం తిరిగి కేటాయింపులు జరిపే వరకు అధికారులు ప్రస్తుత రాష్ట్రాల్లో కొనసాగవచ్చని ప్రకటించింది.

కేంద్రం ఆదేశాలు ఇచ్చిన తర్వాత వెంటనే రిలీవ్ చేయకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. కనీసం 15 రోజులు సమయం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని బ్యూరో క్యాట్స్ కోరింది. కానీ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ విషయంపై 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రానికి అభ్యర్థించాలని తెలిపింది.

అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని.. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలని హైకోర్టు పేర్కొంది. దీనిపై అధికారులు లీగల్ గా ముందుకు వెళ్లచ్చని తెలిపింది. అధికారుల కేటాయింపుకు క్యాట్ కి ఎలాంటి హక్కు లేదని.. బ్యూరో క్యాట్ ల కేటాయింపు కేవలం డీఓపిటి పరిధిలోనే ఉంటుందని వివరించింది.