అలర్ట్‌...జూలై 07న.. ఇంటర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

అలర్ట్‌...జూలై 07న..   ఇంటర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.  2023 జూలై 07న  మధ్యాహ్నం2 గంటలకు ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల ఫ‌లితాలను విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది. ఫలితాను  ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ లో పొందుపరుస్తామని ప్రకటించింది.  

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు 2023  జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్షల‌ను నిర్వహించారు. 

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు.

ఇక 2023  జూలై 07న  మధ్యాహ్నం3 గంటలకు ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రభుత్వ ప‌రీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకట‌న‌లో తెలిపారు. bse.telangana.gov.in వెబ్సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.