ట్యాంక్ బండ్ పై జనసేన నేతల ఆందోళన

ట్యాంక్ బండ్ పై జనసేన నేతల ఆందోళన

ఏపీలో అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని... హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని... లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ హెచ్చరించారు. 

ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తలా? లేక ప్రజా రక్షకులా అని శంకర్ గౌడ్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర కోసం తెగ ఆరాటపడుతున్న అధికార పార్టీ... గడిచిన మూడున్నరేండ్లు ఏం చేసిందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే కొత్త డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా..పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అండగా ఉంటామని  స్పష్టం చేశారు.