టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల 

టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల 

హైదరాబాద్ : టీఎస్ లాసెట్ , పీజీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. లాసెట్, పీజీ లాసెట్ రాసిన అభ్యర్థుల్లో 74శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 74.76% మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 68.57%  అర్హత సాధించారు. పీజీ లాసెట్ లో 91.10% ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది జులై 21, 22 తేదీల్లో లాసెట్‌ పరీక్ష నిర్వహించారు.  లాసెట్ ఎంట్రెన్స్ కోసం మొత్తం 35,538 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 28,921 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.