
హైదరాబాద్: రాష్ట్ర లా సెట్, పీజీ ఎల్‌సెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను శుక్రవారం ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. 3 ఏళ్ల లా కోర్సు ఎంట్రెన్స్‌కు 15,398 మంది హాజరుకాగా.. 12,103 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 5 ఏళ్ల లా కోర్సు ఎంట్రెన్స్‌కు 3,973 మంది హాజరుకాగా 2,477 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. పీజీ ఎల్‌సెట్ కు 2,188 మంది హాజరుకాగా ఈ పరీక్షల్లో 1,992 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అక్టోబర్ 9న టీఎస్ లా సెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించారన్నారు. పరీక్షలకు మొత్తం 30,310 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 21,520 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు ఉన్నత విద్యామండలి చైర్మైన్ పాపిరెడ్డి.