పీఈసెట్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్

పీఈసెట్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: బీపీడీఈ, డీపీఈడీ తదితర ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీఈసెట్–2021 అడ్మిషన్​ షెడ్యూల్ రిలీజైంది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఆన్​లైన్ రిజిస్ర్టేషన్లతో పాటు స్కాన్డ్ సర్టిఫికెట్లను అప్​లోడ్ చేయాలని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్​రమేష్​బాబు చెప్పారు.

18 నుంచి 20 వరకు స్పెషల్ కేటగిరి స్టూడెంట్ల సర్టిఫికెట్ల ఫిజికల్ వెరిఫికేషన్, 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ , 27న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. సీట్లు పొందిన స్టూడెంట్లు ఆయా కాలేజీల్లో 30లోగా రిపోర్టు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 బీపీఈడీ కాలేజీల్లో 1,860 సీట్లు, 4 డీపీఈడీ కాలేజీల్లో 350 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.