
తెలంగాణ రాష్ట్ర పాలిసెట్–2022 ఫలితాలను విడుదలైయ్యాయి. బుధవారం నాంపల్లి లోని సాంకేతిక విద్య భవన్ లో ఈ ఫలితాలను సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో MPC విభాగంలో75.73 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారు. BIPC విభాగంలో 75.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, MPC విభాగంలో కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల వర్షిత మొదటి ర్యాంకు సాధించగా.. రెండవ ర్యాంక్ ను సూర్యా పేట్ జిల్లాకు చెందిన చింతలూరి సాయి రోహిత్ సాధించాడు. ఇక BIPC విభాగంలో మేడ్చల్ జిల్లా చేందిన చంద్ర శేఖర్ మొదటి ర్యాంకు సాధించాడు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మణిచరణ్ రెడ్డి రెండవ ర్యాంకు సాధించించాడు.
ఈమేరకు రాష్ట్ర సాంకేతిక, శిక్షణ విద్యా మండలి ఒ ప్రకటన విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం https://polycetts.nic.in లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చని పేర్కొంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ ను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ సారి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లమాకు వేరు వేరుగా ర్యాంకులు ప్రకటించారు.