ఇయ్యాల 16 ఆర్టీసీ ఏసీ బస్సులు ప్రారంభం

ఇయ్యాల 16 ఆర్టీసీ ఏసీ బస్సులు ప్రారంభం

లహరి‌‌‌‌‌‌‌‌, అమ్మ ఒడి గా పేరు

హైదరాబాద్, వెలుగు : ప్రయాణికుల కోసం హైటెక్‌‌‌‌ హంగులతో టీఎస్ ఆర్టీసీ ఏసీ స్లీపర్‌‌‌‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. వీటికి ‘లహరి, అమ్మ ఒడి’ అని పేరు పెట్టింది. తొలి విడతగా 16 బస్సులను సోమవారం ఎల్బీనగర్ లో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ లు ప్రారంభించనున్నారు. విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్లీ రూట్లలో వీటిని నడపనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్టీసీ పేర్కొంది.

ఇటీవల 630 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను, ఎనిమిది నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను, నాలుగు నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టం, ట్రాకింగ్‌‌‌‌ సిస్టం, పానిక్‌‌‌‌ బటన్ సౌలత్​కల్పించారు. అలాగే వీటిని టీఎస్‌‌‌‌ఆర్టీసీ కంట్రోల్‌‌‌‌ రూమ్​కు కనెక్ట్ చేశారు. ప్రయాణికులు పానిక్‌‌‌‌ బటన్‌‌‌‌ను నొక్కగానే కంట్రోల్‌‌‌‌ రూమ్​కు సిగ్నల్​వెళ్తుంది.. అక్కడి ఆఫీసర్లు స్పందించి తగు చర్యలు తీసుకుంటారు.