TS SET: టీఎస్ సెట్ ఎగ్జామ్ వాయిదా

TS SET: టీఎస్ సెట్ ఎగ్జామ్ వాయిదా

తెలంగాణలో టీఎస్ సెట్ (TS SET) ఎగ్జామ్ వాయిదా పడింది.  ఈ నెల 13న జరగాల్సిన పరీక్ష  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. 13న  జరగాల్సిన పరీక్ష షెడ్యూల్ ను మార్చి 10 తేదీలోగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. 14,15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయన్నారు.

తెలంగాణలోని యూనివర్శిటీలు, డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే  తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ (TS SET) నోటిఫికేషన్ ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే..