సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు...ఇలా చెక్ చేసుకోండి

సెప్టెంబర్ 27న  టెట్ ఫలితాలు...ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలు సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం  10గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు https://tstet.cgg.gov.in/  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పేపర్‌-2తో పోల్చుకుంటే పేపర్‌-1 పేపర్ ఈజీగా  వస్తే, పేపర్‌-2 కాస్తా టఫ్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే టెట్ ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.

సెప్టెంబర్  15న టెట్‌ పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షను 2,26,744 (84.12శాతం) రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష జరిగింది.  మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్ష నిర్వహించింది. పేపర్‌-1కు 2.26 లక్షలు, పేపర్‌-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఇటీవలే టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు..సెప్టెంబర్ 27వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు.