పోలింగ్ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించండి

పోలింగ్ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించండి

హైదరాబాద్, వెలుగు:  పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు తగిన సౌకర్యాలు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్​ కోరింది. ఎన్నికలు సజావుగా సాగటానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ  టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మంళవారం సీఈవో వికాస్ రాజ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రతి 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్‌‌‌‌ను ఏర్పాటు చేయాలన్నారు. లేదా 800 మంది ఓటర్లు దాటిన ప్రతి పోలింగ్ స్టేషన్‌‌‌‌కు ఒక అదనపు పోలింగ్ ఆఫీసర్ ను కేటాయించాలని కోరారు.  గత ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఈసారి అలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు.