నూతన విద్యావిధానంలో టీసాట్ను భాగస్వామిగా చేస్తం

నూతన విద్యావిధానంలో టీసాట్ను భాగస్వామిగా చేస్తం
  • వేం నరేందర్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించబోయే నూతన విద్యావిధానంలో టీసాట్ (తెలంగాణ స్కిల్స్ అకాడమిక్స్ అండ్ ట్రైనింగ్)ను భాగస్వామిగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీహిల్స్‌‌లోని టీసాట్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించిన వేం నరేందర్ రెడ్డికి టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సంస్థ పనితీరును వివరించారు. 

దానిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన..ఆధునిక సాంకేతికతకు తగ్గట్టు స్టూడియోలను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ దిశగా సంస్కరణలు చేపట్టారు. రాబోయే నూతన విద్యావిధానంలో టీసాట్ను భాగస్వామ్యం చేస్తం’’ అని చెప్పారు.