టీసాట్లో టెట్ క్లాసులు స్పెషల్ లైవ్.. 44 రోజుల పాటు డిజిటల్ కంటెంట్ ప్రసారాలు

టీసాట్లో టెట్ క్లాసులు  స్పెషల్ లైవ్.. 44 రోజుల పాటు డిజిటల్ కంటెంట్ ప్రసారాలు
  •  
  •     టీజీ టెట్– 2026 డిజిటల్​ కోచింగ్​పోస్టర్​ను ఆవిష్కరించిన 
  • మంత్రి శ్రీధర్​ బాబు


హైదరాబాద్, వెలుగు: టెట్ అభ్యర్థులకు వచ్చే 44 రోజుల పాటు టీసాట్​ఆన్​లైన్ కోచింగ్ ఇవ్వనుంది. మంగళవారం స్పెషల్​ లైవ్​ను  ప్రారంభించిన టీసాట్​.. బుధవారం కూడా దానిని కొనసాగించనుంది. వచ్చే 44 రోజుల పాటు 200 ఎపిసోడ్ల డిజిటల్​కంటెంట్​ను అభ్యర్థుల కోసం ప్రసారం చేయనుంది. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్​లో ‘టీజీ టెట్ 2026 డిజిటల్​కోచింగ్’ పోస్టర్​ను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. 

టీసాట్​లో డిజిటల్​ కంటెంట్​ద్వారా టెట్​కు అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించారు. టీసాట్ నెట్​వర్క్​లో అందుబాటులో ఉండే కంటెంట్ అన్ని స్థాయిల అభ్యర్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లుడుతూ.. బుధవారం ప్రత్యేకంగా ఒరియెంటేషన్​ను నిర్వహిస్తున్నామని, మరో 44 రోజులు 200 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. 

టీసాట్ నిపుణ చానల్ లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు, విద్య చానెల్​లో ఉదయం ఐదు గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి రోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలుంటాయని పేర్కొన్నారు.