న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 9కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారతదేశానికి తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది.
హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు చార్జ్‌షీట్‌లోని వివరాలపై కౌంటర్ దాఖలుకు మరో రెండు వారాల సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
