అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ రోజున అదృశ్యమైన నిఖితా అనే యువతి మేరీల్యాండ్ లోని ఆమె మాజీ ప్రియుడు అర్జున్ ఫ్లాట్ లో శవమై కనిపించింది. అర్జున్ ఫ్లాట్ లో నిఖితా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అతనే ఈ హత్య చేసి ఇండియా పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. అర్జున్ పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు పోలీసులు.
ప్రస్తుతం పరారీలో ఉన్న అర్జున్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా పని చేస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం ( జనవరి 2 ) నిఖిత అదృశ్యమైనట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు గుర్తించామని తెలిపారు. మేరీల్యాండ్ సిటీలోని అర్జున్ శర్మ ఫ్లాట్ లో డిసెంబర్ 31న చివరిసారి కనిపించినట్లు పోలీసులకు తెలిపారు అపార్ట్మెంట్ వాసులు.
ఈ క్రమంలో అపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు అర్జున్ ఫ్లాట్లో కత్తి పోట్లతో పడి ఉన్న నిఖిత మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. నిఖిత స్వస్థలం హైదరాబాద్ లోని లాలాగూడలోని విజయపురి కాలనీ అని సమాచారం. అర్జున్ శర్మ స్వస్థలం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
