హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననం తప్ప మరొకటి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మావోయిస్టులు నేరాలు చేసి ఉంటే వారిని అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని, ఇలా ఫేక్ ఎన్‌కౌంటర్లు చేయడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
