ఏఐ నేపథ్యంలో సరికొత్తగా వస్తున్న సినిమా ‘కిల్లర్’

ఏఐ నేపథ్యంలో సరికొత్తగా వస్తున్న సినిమా ‘కిల్లర్’

జ్యోతి పూర్వజ్, మనీష్  గిలాడ లీడ్ రోల్స్‌‌లో పూర్వజ్ దర్శకత్వం వహిస్తూ పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కిల్లర్’. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిద్ధంగా ఉన్న ఈ మూవీ నుంచి  ‘ఫైర్ అండ్ ఐస్’ అంటూ సాగే పాటను  విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్  ఈవెంట్‌లో  హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ ‘కొత్త తరహా కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడియెన్స్  ముందుకు వస్తున్నాం. ఓ యాక్షన్ మూవీ చేయాలనుకున్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరింది’ అని చెప్పింది. డిఫరెంట్ రోల్ పోషిస్తున్నట్టు మనీష్ గిలాడ అన్నాడు.

డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ ‘సరికొత్త  ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.  ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతుంది. ఇందులో  జ్యోతి పూర్వజ్ ఐదు డిఫరెంట్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించింది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముడిపడి ఉన్న  ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది’ అని చెప్పాడు. ఇందులోని విజువల్స్ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తాయని నిర్మాత అన్నారు.   నటులు సీతారామ్, విశాల్ రాజ్, చందు, గౌతమ్ చక్రధర్ పాల్గొన్నారు.