ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలి : రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్

ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలి : రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్

జైపూర్(భీమారం), వెలుగు: పశువుల కాపరులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు అరికట్టాలని రాష్ట్ర గొర్రె, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్ డిమాండ్​చేశారు. మంగళవారం భీమారం మండలం కాజిపల్లిలో శ్రీకృష్ణ యాదవ సొసైటీ ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​ గెస్టులుగా డీసీవో సత్యనారాయణ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి అశోక్​యాదవ్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘాల అభివృద్ధికి 75 శాతం సబ్సిడీతో లోన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 50 ఏండ్లు దాటిన పశువుల కాపరులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన కాపరులకు  రూ.10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్​చేశారు. సంఘాల అధ్యక్షులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. 

సంఘం జిల్లా అధ్యక్షుడు చేగుంట రాజన్న యాదవ్, బీసీ ఉద్యమ నాయకుడు చుంచు రాజు కిరణ్, గురువయ్య, రాజేశ్, నియోజకవర్గ అధ్యక్షుడు సమ్మయ్య, సంఘం నాయకులు మల్లేశ్, పర్వతాలు, దుశాంత్, మహిళలు పాల్గొన్నారు.