కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూలోని మంజీర హాస్టల్ లో అపరిశుభ్ర భోజనం పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై గతంలో హాస్టల్ నిర్వాహకులకు, వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి డిన్నర్లో స్టూడెంట్స్కు వడ్డించిన అన్నంలో పురుగులు వచ్చాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.
