వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర అనుబంధ బద్దిపోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించాలరు. ఇదే అదునుగా కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని భక్తులు ఆరోపిస్తున్నారు. కొబ్బరి కాయ కొట్టేందుకు రూ. 20, బోనంతో వచ్చిన మహిళల నుంచి నైవేద్యం సమర్పించేందుకు రూ.50 వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. సిబ్బంది భక్తుల నుంచి డబ్బులు తీసుకునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
