‘ట్రినిటి’లో నేషనల్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌ యూత్ ఫెస్ట్‌‌‌‌‌‌‌‌ : చైర్మన్‌‌‌‌‌‌‌‌ దాసరి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

‘ట్రినిటి’లో నేషనల్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌ యూత్ ఫెస్ట్‌‌‌‌‌‌‌‌ : చైర్మన్‌‌‌‌‌‌‌‌ దాసరి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ట్రినిటి విద్యాసంస్థల ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ దాసరి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొమ్మకల్‌‌‌‌‌‌‌‌లోని ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీలో ‘మేథ–2026’ పేరిట నేషనల్ లెవెల్  యూత్ ఫెస్ట్ నిర్వహించారు. ఫెస్ట్‌‌‌‌‌‌‌‌ను జబర్దస్త్‌‌‌‌‌‌‌‌ ఫేం వెంకీ, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డితో కలిసి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 2300 మంది విద్యార్థులు 25 రకాల ఫార్మల్, ఇన్ఫార్మల్ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడ్డారు. 

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్లు కమ్యూనికేషన్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు  వృత్తిపరమైన నైపుణ్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రపంచమే గ్లోబల్ విలేజ్‌‌‌‌‌‌‌‌గా మారిన ఈ కాలంలో అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ వెంకీ తన స్కిట్లతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేంద్ర సింగ్,  అకాడమిక్ డైరెక్టర్ బి.రాజగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ పి.కిశోర్, ఏవో రాజశేఖరరెడ్డి, ఎంబీఏ హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ  ప్రవీణ్ కుమార్, లెక్చరర్లు పాల్గొన్నారు