NSILలో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టులు.. బీటెక్, పిజి చదివినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

 NSILలో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ఇంజినీర్  పోస్టులు.. బీటెక్, పిజి చదివినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

న్యూస్పేస్ ఇండియా (NSIL)  ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోండి.. 

పోస్టులు: 47. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 22, ప్రాజెక్ట్ ఇంజినీర్లు 15, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 10.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బి.టెక్/ బీఈ, డిప్లొమా, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.టెక్/ ఎంఈ, ఎం.ఫిల్/ పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.250.

లాస్ట్ డేట్: నవంబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: ఎన్ఎస్ఐఎల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా నమోదు చేసుకున్న అభ్యర్థులకు వాక్- ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు nsilindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.