ఓటరు నమోదు కోసం టీచర్లకు ఓడీ ఇవ్వండి

ఓటరు నమోదు కోసం టీచర్లకు ఓడీ ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం టీచర్లకు ఆన్ డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పించాలని రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌‌ స్కీమ్‌‌ ఎంప్లాయీస్‌‌ యూనియన్‌‌(టీఎస్‌‌సీపీఎస్‌‌ఈయూ) నేతలు కోరారు. మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌‌గౌడ్‌‌లు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌‌రాజ్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నందున హైస్కూల్ టీచర్లకు ఈ నెల 7న ఓడీ సౌకర్యం కల్పించాలని కోరారు. సరిహద్దు జిల్లాలైన నారాయణపేట్, గద్వాలలో పనిచేస్తూ పక్క రాష్ట్రంలో నివాసముంటున్న వారి ఆధార్ కార్డుల ఆధారంగా కాకుండా.. పనిచేస్తున్న సంస్థ ఆధారంగా ఓటు నమోదుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.