కొత్తగా 100 ప్రొడక్టులు వెల్లడించిన టీఎస్​డీడీసీఎఫ్

కొత్తగా 100 ప్రొడక్టులు వెల్లడించిన టీఎస్​డీడీసీఎఫ్

హైదరాబాద్​, వెలుగు: విజయ డెయిరీ రాష్ట్రవ్యాప్తంగా మరో 2000 అవుట్​లెట్స్​ను ప్రారంభించడంతోపాటు​ మరో 100 కొత్త ప్రొడక్టులను తేనుందని తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కో-–ఆపరేటివ్ ఫెడరేషన్ (టీఎస్​డీడీసీఎఫ్​) ప్రకటించింది.  హైదరాబాద్​లో శుక్రవారం హైటెక్స్‌‌‌‌లో డెయిరీ/ఫుడ్ ప్రొడక్ట్స్, ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్‌‌‌‌తో కూడిన ట్విన్ డెయిరీ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్​ ప్రారంభమైంది. ఇది మూడు రోజుల కార్యక్రమం.  డెయిరీ/ఆహార ఉత్పత్తులు, ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్ మెషినరీ,  అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఇది. దీనిని మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. టీఎస్​డీడీసీఎఫ్  చైర్మన్​ సోమ భరత్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  ఒకప్పుడు మూతపడిన విజయ డెయిరీ ఇప్పుడు బాగా పనిచేస్తోందని, పోయిన ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1000 కోట్ల టర్నోవర్​ను టార్గెట్​గా పెట్టుకున్నామని చెప్పారు.  ‘‘ప్రస్తుతం విజయా డెయిరీకి సుమారు 1000 అవుట్‌‌‌‌లెట్స్​ ఉన్నాయి.  మా వద్ద 27 ఉత్పత్తులు ఉన్నాయి.  

కొత్తగా మిల్క్ షేక్, కాఫీ, టీ, ఫ్లేవర్డ్ మిల్క్, ఐస్ క్రీం, కుల్ఫీ, కుకీలు, హెల్త్ బార్‌‌‌‌లు మొదలైన 100 ప్రొడక్టులను తేబోతున్నాం. హైదరాబాద్​కు ప్రతిరోజు కోటి లీటర్ల పాలు అవసరం.  ఉత్పత్తి  70 లక్షలు మించడం లేదు. పాల ఉత్పత్తిని పెంచడానికి రెండు లక్షల జంతువులను కొని రైతులకు ఇస్తాం. దీని ద్వారా సుమారు 6 నుండి 8 లక్షల లీటర్ల అదనపు ఉత్పత్తి సాధ్యపడుతుంది”అని వివరించారు. ఈ ఎక్స్‌‌‌‌పోలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, గోద్రెజ్ క్రీమ్‌‌‌‌లైన్ జెర్సీ ప్రొడక్ట్స్, దొడ్ల   డెయిరీ వంటి 105 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఎగ్జిబిషన్​ను దాదాపు 7500 మంది చూస్తారని అంచనా. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్​టీసీసీఐ), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్‌‌‌‌కి మద్దతుగా మీడియా డే మార్కెటింగ్ ఈ ప్రదర్శనను నిర్వహించిందని ఎస్​డీడీసీఎఫ్​ తెలియజేసింది.