TSPSC: పేపర్ లీక్ నిందితులకు 14 రోజుల రిమాండ్

TSPSC: పేపర్ లీక్ నిందితులకు 14 రోజుల రిమాండ్

టీఎస్ పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  పోలీసులు  8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. 

రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. నిందితుడు ప్రవీణ్  సెల్ ఫోన్లో చాలా మంది మహిళల ఫోన్ నంబర్లు ఉన్నాయని..టీఎస్పీ ఎస్సీ కి వచ్చే మహిళలతో సంబంధాలన్నాయని గుర్తించారు. ప్రధాన సర్వర్ నుంచి ప్రవీణ్ పేపర్ ను కొట్టేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

మరోవైపు ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  పేపర్  ఎక్కడ లీకేజ్ అయిందో పోలీసులు గుర్తించారు.  మహబూబ్ నగర్ జిల్లా  గండేడ్ తండాకు 50 కి.మీ దూరంలో ఇద్దరు పేపర్ మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గండేడ్ లో పేపర్లు తీసుకున్న ఆ ఇద్దరు ఎవరనేదానిపై విచారణ కొనసాగుతోంది. పేపర్ లీక్ పై  పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆ ఇద్దరు అభ్యర్థులెవరనేది కూడా  ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనిపై  పోలీసులు ఎందుకు పరిధి దాటి విచారించడం లేదనేది చర్చనీయాంశంగా మారింది.