- టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించిన అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) రిజల్ట్స్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు బుధవా రం టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడిం చారు. పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా రిజల్ట్స్ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారిని పోలీసు లు అడ్డుకున్నారు. రిజల్ట్ఎప్పుడిస్తార నే విషయాన్ని అధికారులను అడిగేం దుకు తాము ఇక్కడికి వచ్చామని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని అభ్యర్థులు ప్రశ్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

