
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ మొద లైంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇతర రాష్ట్రాల్లోని రిక్రూట్మెంట్ బోర్డుల పనితీరును పరిశీలించేం దుకు సర్కారు రెండు బృందాలను నియమించింది. కమిషన్ సెక్రటరీ అనితా రాంచంద్రన్ నేతృత్వంలోని ఓ టీమ్.. ఇటీవల కేరళ సర్వీస్ కమిషన్ను సందర్శించింది. సీఎస్ శాంతికుమారికి రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది.
కాగా..ఈ నెల 5న సీని యర్ ఐఏఎస్ అధికారివాణిప్రసాద్ నేతృత్వంలో మరో టీమ్ ఢిల్లీలోని యూపీఎస్సీ ఆఫీసును సందర్శించ నుంది. సిబ్బంది పనితీరు, కాన్ఫిడె న్షియల్ వర్క్ ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకోనుంది.