డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష యదాతథం..టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు..

డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష యదాతథం..టీఎస్పీఎస్సీ  వెబ్సైట్లో  హాల్ టికెట్లు..

మే 19వ తేదీన జరిగే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష యదాతథంగా నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు...మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్ లో పరీక్ష నిర్వహిస్తునట్లు తెలిపింది. మే 12వ తేదీ నుండి TSPSC అఫిషియల్ వెబ్ సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.  అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని  సూచించింది. 

అప్పుడు వాయిదా..

డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష మే 7వ తేదీన జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్స్ ఎఫెక్ట్ తో  డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష మే 19కి వాయిదా పడింది.దీంతో పాటు...మరికొన్ని పరీక్షలను కూడా టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 23న జరగాల్సిన ఏఎంవీఐ పరీక్షను జూన్ 28కి వాయిదా వేసింది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ మే 16కి వాయిదా పడింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌ గెజిటెడ్ పోస్టుల పరీక్షలు జూలై 18, 19 కి వాయిదా పడ్డాయి.  మే 15, 16 దీల్లో జరగాల్సి ఉన్న గ్రౌండ్ వాటర్‌లో నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షలు జులై 20, 21వ తేదీలకు వాయిదా పడ్డాయి. 

ఎన్ని పోస్టులు..

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 22 2022లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఔషధ నియంత్రణ విభాగం పరిధిలో 18 పోస్టుల్ని భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2022  డిసెంబర్ 16 నుంచి 2023 జనవరి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. టీఎస్‌పిఎస్సీ భర్తీ చేయనున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 5ఉద్యోగాలు మల్టీ జోన్ -1 పరిధిలో ఉన్నాయి. మల్టీ జోన్‌ 2 పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. 

పరీక్షవిధానం

450 మార్కులకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్లో  రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో.. పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.