
హైదరాబాద్, వెలుగు : గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. 19వ తేదీ నుంచి 21 వరకు www.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ సెక్రటరీ అనితా రాంచంద్రన్ తెలిపారు. అప్లికేషన్లో బయోడేటా (పేరు, డేటాఫ్ బర్త్, జెండర్), అర్హతలు, ఫొటో, సంతకం, ఇతర డేటాను ఎడిట్ చేసుకునే అవకాశముం దని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలని సూచించారు. లేకపోతే వాటిని పరిగణనలోకి తీసుకోబోమన్నారు. కాగా 503 గ్రూప్–1 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ ఉండగా.. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది.